దౌల్తాబాద్: మండలంలో సేవలందిస్తున్న 108 అంబులెన్స్ ను శుక్రవారం జిల్లా కోఆర్డినేటర్ హరి రామకృష్ణ ఆకస్మిక తనిఖీ చేశారు. అంబులెన్స్ లో గల అత్యవసర మందులు, పరికరాలు, ఆక్సిజన్, పలు రికార్డులను పరిశీలించారు.108 సిబ్బంది అందిస్తున్న సేవలపట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు అందుబాటులో ఉండి వైద్యం అందించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ టెక్నీషియన్ భాను, పైలట్ నర్సింలు పాల్గొన్నారు…..