కోదాడ పట్టణ పరిధిలోని దుర్గాపురం లో గత 50 ఏళ్లుగా ఆధ్యాత్మికంగా, సామాజికంగా విరాజిలుతున్న మదీనా తుల్ ఉలుమ్ మదర్సా స్వర్ణోత్సవాలను జనవరి 4,5 తేదీల్లో జయప్రదం చేయాలని విద్యాసంస్థ వ్యవస్థాపకులు మౌలానా అబ్దుల్ ఖాద్రీ రషాది, మౌలానా అహ్మద్ నద్వి లు పిలుపునిచ్చారు. గురువారం మదర్సాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పేద విద్యార్థులకు ఆధ్యాత్మిక విద్యతోపాటు సాధారణ విద్యను కూడా ఎటువంటి ప్రభుత్వ సహాయం లేకుండా గత 50 ఏళ్లుగా నిర్వహిస్తున్నామని నాటినుండి నేటి వరకు వందలాది మంది పేద విద్యార్థులు ఆధ్యాత్మిక గురువులుగా ఉర్దూ ఉపాధ్యాయులుగా ప్రభుత్వ ఉద్యోగాలుగా ఉన్నత స్థానాలకు ఎదిగారన్నారు. ఉచిత విద్యత పాటు ఉచిత వసతి సదుపాయాలను కల్పించామన్నారు స్వర్ణోత్సవాల సందర్భంగా 50 ఏళ్లుగా పాఠశాల నుండి హాఫీస్ కోర్సులు పూర్తి చేసిన వారికి ధ్రువీకరణ పత్రాలతో పాటు సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.జనవరి 4న పూర్వ విద్యార్థుల సమ్మేళనము సన్మాన కార్యక్రమం జనవరి 5వ తేదీన భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల నుండి బహిరంగ సభకు దేశ నలుమూలల నుంచి ఆధ్యాత్మిక గురువులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.పాఠశాల పూర్వ విద్యార్థులతో పాటు ఆధ్యాత్మిక గురువులు ముస్లిం సహోదరులు ఈ వేడుకలలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో జనరల్ సెక్రటరీ మౌలానా అహ్మద్ నద్వి, మౌలానా హమీద్, షేక్ నిజాం, అబ్దుల్ ఖాదిర్, ఊబేద్ రహమాన్, రఫిక్ ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు……
- Home
- తెలంగాణ
- మదీనా తుల్ ఉలూమ్ మదర్సా స్వర్ణోత్సవాలు జయప్రదం చేయాలి……. కోదాడలో గత 50 ఏళ్లుగా ఆధ్యాత్మిక, సామాజిక విద్యా కేంద్రంగా విరాజిల్లుతున్న మదీనా తుల్ ఉలూమ్ మదర్సా……. జనవరి 4న పూర్వ విద్యార్థుల సమ్మేళనం….. జనవరి 5న భారీ బహిరంగ సభ….మదీనా తుల్ ఉలుమ్ మదర్స స్వర్ణ ఉత్సవాలకు హాజరుకానున్న ఆధ్యాత్మిక గురువులు………