కోదాడలో కబడ్డీ క్రీడకు జాతీయస్థాయిలో గుర్తింపు తీసుకువచ్చిన ఖాజా భాయ్ ఆశయాలను నేటి యువత సాధించాలని రాష్ట్ర కబడ్డీ క్రీడాకారులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు షేక్ మహబూబ్ జాని, బషీర్ లు అన్నారు. ఖాజా భాయ్ 35వ వర్ధంతి సందర్భంగా గురువారం కోదాడ పట్టణంలోని వారి నివాసంలో క్రీడాకారులతో కలిసి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1970 -90 కాలంలో కోదాడలో కబడ్డీ క్రీడాకారూడిగా అనేక విజయాలు సాధించి ఆ రోజుల్లో ఎంతో మందిని జాతీయ క్రీడాకారులుగా ఎదిగేందుకు కృషి చేశారన్నారు.ఖాజా భాయ్ తోనే ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు కబడ్డీ క్రీడలో కోదాడకు ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. క్రీడాకారులు ఖాజా భాయ్ ఆశయాలు సాధించాలన్నారు. కబడ్డీ క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు తమ వంతు సహకారం అందిస్తానన్నారు. కోదాడలో స్టేడియం నిర్మిస్తే ఖాజా బాయ్ పేరు పెట్టాలని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బాగ్దాద్,భాజాన్, కాంపాటి శ్రీను, పంది తిరపయ్య,ఏపూరి రాజు,గంధం పాండు, కత్తి వెంకటరత్నం, శమీ,మునీర్, నిజాం, రహీం, సైదులు పలువురు క్రీడకారులు కాజా భాయ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.