Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

తెలంగాణలో పంచాయతీ కార్మికులకు ఇక అకౌంట్లలో జీతాలు..!!_ ఇప్పటికే బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించిన పంచాయతీ రాజ్ శాఖ గతంలో గ్రామ పంచాయతీల నుంచి చెల్లింపులు.. పలు ఇబ్బందులు జనవరి నెల నుంచే అకౌంట్లో వేతనాలు.. తీరనున్న 48 వేల మంది కష్టాలు

హైదరాబాద్ : రాష్ట్రంలోని పంచాయతీ పారిశుధ్య కార్మికులకు ఇక నుంచి నెలనెలా జీతాలు వారి అకౌంట్లోనే పడనున్నాయి. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ రాష్ట్రవ్యాప్తంగా పారిశుధ్య కార్మికుల బ్యాంకు ఖాతా వివరాలు సేకరించింది. ఈ నెల నుంచే వారి జీతాలను అకౌంట్లలో జమచేయాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. గతంలో వీరికి గ్రామ పంచాయతీల నుంచి జీతాలు ఇచ్చేవారు. దీనివల్ల సమస్యలు తలెత్తేవి. పంచాయతీ కార్యదర్శులు సమయానికి జీతాలు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడేవారు. వారి కుటుంబాలను పోషించడం కష్టంగా మారేది. ఇప్పుడు నేరుగా అకౌంట్లోనే డబ్బులు జమకానుండడంతో పారిశుధ్య కార్మికులు ఏండ్లుగా ఎదుర్కొన్న సమస్య పరిష్కారం కానున్నది.

 

రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న పారిశుధ్య కార్మికుల వివరాలను పంచాయతీరాజ్ శాఖ సేకరించినట్టు తెలిసింది. వాటిని ఈ- పంచాయత్ వెబ్సైట్లో నమోదు చేసినట్టు సమాచారం. రాష్ట్రంలో 32 జిల్లా పరిషత్లు, 620 మండల పరిషత్లు, 12,769 గ్రామ పంచాయతీల్లో 48 వేల పైచిలుకు మంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు. దీర్ఘకాలికంగా సేవలందిస్తున్నప్పటికీ వారి వివరాలు ప్రభుత్వం వద్ద లేవు. దీంతో సేవలకు సంబంధించి సీఎం, మంత్రుల సమీక్షల సందర్భంగా స్పష్టమైన సమాచారాన్ని ఉన్నతాధికారులు ఇవ్వలేక పోతున్నారు. జీతాలు సరిగా ఇవ్వడం లేదని, పనిభారం ఎక్కువగా ఉందని కొందరు కార్మికులు వెళ్లిపోతుండగా.. వారి స్థానంలో కొత్తవారిని తీసుకోవడం లేదు. సరైన సంఖ్య తేలక ఏటా జీతాల చెల్లింపులకు బడ్జెట్ కేటాయింపులు సరిగా జరగడం లేదు. ఒక్కోసారి 3 నెలలపాటు జీతాలు అందట్లేదు. ఈ సమస్యల నేపథ్యంలో వారందరి వివరాలు పక్కాగా నమోదు చేయాలని పంచాయతీరాజ్శాఖ నిర్ణయించింది.

Related posts

మానసిక ప్రశాంతతకు యోగా దివ్య ఔషధం

TNR NEWS

ఆకుపాముల గ్రామంలో బడిబాట కార్యక్రమం

TNR NEWS

ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పట్ల సంబరాలు

TNR NEWS

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి

TNR NEWS

ఈనెల 24న జిల్లా కరాటే అసోసియేషన్ల ముఖ్య సమావేశం

Harish Hs

రైతు సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలి…  రాష్ట్ర ఐటీ , పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు త్వరలో మిగిలిన రైతులకు రుణమాఫి నిధుల జమ ప్రతి రైతుకు ప్రభుత్వం ద్వారా అందే సహాయాన్ని వివరిస్తూ గ్రామాలలో బోర్డులు ఏర్పాటు *ధాన్యం కొనుగోలు పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి శ్రీధర్ బాబు

TNR NEWS