Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

పోలీసులకు, ఉద్యమకారుల మధ్య  తోపులాట…  ఉద్రిక్తం…  ఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకుల అక్రమ అరెస్టు, విడుదల  అనుమతులన్నింటినీ రద్దు చేసేంతవరకుఐక్యంగా ఉద్యమిస్తాం … ఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటీ నేతలపిలుపు….

మోతే: ఇథనాల్ కంపెనీకి ఇచ్చిన అనుమతులు రద్దు అయ్యేంతవరకు ఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఐక్యంగా పోరాటాలు చేస్తామని నాయకులు పిలుపునిచ్చారు. బుధవారం మోతే మండలం మండలం రావి పహాడ్ గ్రామంలో ఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలోఇథనాల్ కంపెనీ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కంపెనీ ముందు రిలే నిరాహార దీక్షలను పోలీసులు భగ్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఆందోళనకారుల మధ్య తీవ్ర తోపులాట జరగడంతో ఉదృత పరిస్థితి నెలకొంది. అనంతరం పోలీసులు ఉద్యమకారులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులుమాట్లాడుతూ మోతే మండలం రావి పహాడ్ గ్రామంలో నిర్మిస్తున్న ఎన్ఎంకె ఇథనాల్ కంపెనీ అనుమతులు రద్దుచేయాలనిశాంతియుతంగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న రైతులు ను అక్రమంగా అరెస్టు చేయడం సమంజసం శాంతియుతంగా తమ నిరసన తెలియజేయడానికి టెంటు వేసుకుంటుంటే పోలీసులు అడ్డుకోవడం ఎంతవరకు సబబు అని శాంతియుతంగా చేస్తున్న నిరాహార దీక్షను అడ్డుకోవడం అంటే ప్రజల హక్కులను పోలీసులు కాల రాయడమేనని అన్నారు. కంపెనీపనులు పూర్తి అయితే చుట్టుపక్కన గ్రామాలైన ఆత్మకూర్ (ఎస్) మండలంశెట్టి గూడెం, కోట పహాడ్, మోతే మండలం సర్వారం, కూడలి, అప్పన్నగూడెం, బురకచర్ల, గోల్ తండా, మేకల పాటి తండా, సిరికొండ గ్రామాలతో పాటు అనేక గిరిజన తండాలు, వీటితో పాటు చుట్టుపక్కన ఉన్న అనేక గ్రామాలలో నివాసం ఉంటున్న ప్రజల ఆరోగ్యం పైఇథనాల్ కంపెనీ కాలుష్యం తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు.ఈ ఇథనాల్ కంపెనీ కాలుష్యం వల్ల శ్వాసకోశ వ్యాధులు, చర్మ వ్యాధుల తో పాటు గుండె, మెదడు, కిడ్నీ, లివర్ తదితర వ్యాధులకు గురై ప్రజలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం నెలకొని ఉందన్నారు. దీని మూలంగా భవిష్యత్తులో చుట్టూ 20 కిలోమీటర్ల మేర మనుషులు బతికే పరిస్థితి ఉండదన్నారు. ఈ ఫ్యాక్టరీ కాలుష్యం మూలంగా రైతుల పంటలు పూర్తిగా నాశనం అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో బంగారo పండే పంట భూములు బీడు భూములుగా మారే పెను ప్రమాదం ఉందన్నారు.ఈ ఫ్యాక్టరీ నుండి విడుదల అయ్యే వ్యర్ధాలను పక్కనే ఉన్న పాలేరు రిజర్వాయర్ లోకి వదిలితే చుట్టుపక్కన ఉన్న భూగర్భ జలాలు పూర్తిగా తగ్గిపోయి నీరు కలుషితంగా మారి ప్రజలు, రైతులు, పశువులు, చేపలు, మూగజీవులు చనిపోయే ప్రమాదం ఉందన్నారు. ఈ విషయమై తక్షణమే అధికార ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని ఇథనాల్ కంపెనీ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

ఈ సందర్భంగా 7మంది ని అరెస్టు చేసి సొంత పూచికతపై విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటీజిల్లా నాయకులుమట్టిపల్లి సైదులు, పేర్ల నాగయ్య, కొనుకుంట్ల సైదులు, నల్లెడ మాధవరెడ్డి, నారబోయిన వెంకట్ యాదవ్, ఆవుల నాగరాజు యాదవ్, కునుకుంట్ల సైదులు, కాకి సురేందర్ రెడ్డి, కాంపాటి దిలీప్, కాకి నారాయణ రెడ్డి, పానగంటి మల్లారెడ్డి, పందిళ్ళపల్లి మల్లారావు, కాకి పాపిరెడ్డి, అలుగుబెల్లి వెంకటరెడ్డి, పో డపంగి ముత్తయ్య, బాల గాని మదర్ గౌడ్, సోమ గాని మల్లయ్య, వెలుగు మధు చేగువేరా, పుల్లూరి సింహాద్రి, పిడమర్తి భరత్ వెన్నెల, హరీష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఘనంగా కార్తీక దీపోత్సవం

TNR NEWS

తెలంగాణ ప్రజల బతుకు చిత్రాన్ని మార్చింది బిఆర్ఎస్….

TNR NEWS

ఆపదలో ఉన్నవారికోసం విజ్జన్నా యువసేన అండగా..మంచం పట్టిన యువకుడికి చేయూతనిచ్చిన వినోద్ రెడ్డి 

TNR NEWS

జగన్నాధపురం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంఈఓ

Harish Hs

ఓదార్చి వస్తుండగా అనంతలోకానికి వెనకనుంచి అతివేగంగా వచ్చి ఢీ కొట్టిన లారీ ఒకరు మృతి ఒకరికి తీవ్ర గాయాలు

TNR NEWS

ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి  జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ 

TNR NEWS