కోదాడ పట్టణంలోని ప్రభుత్వ రంగ బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు బ్రాంచ్ మేనేజర్ సంపూర్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మహిళా ఖాతాదారులను, సమాజంలో ప్రజలకు సేవ చేసే మహిళలను గుర్తించి శాలువాతో ఘనంగా సన్మానించి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరంగల్ రీజియన్ లో ఉన్న 41 బ్రాంచ్ లలో కోదాడ బ్యాంకు పూర్తి మహిళా బ్యాంకు గా ఖాతాదారులకు సేవలు అందిస్తున్నదని తెలిపారు. ఈ సందర్భంగా మహిళలు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లర్కు ప్రసన్న బ్యాంకు సిబ్బంది ఖాతాదారులు తదితరులు పాల్గొన్నారు…….