సామజిక రాజకీయ ఆర్థిక అసమానతలకు విరుగుడు విద్య మాత్రమే నని కులావివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున అన్నారు. ఈరోజు kvps జిల్లా కమిటీ ఆధ్వర్యంలో దొడ్డికొమురయ్య భవనంలో జరిగింది. ఈ సందర్బంగా పాలడుగు నాగార్జున మాట్లాడుతూ మణుధర్మశాస్త్రం శాసనoగా ఆరోజుల్లో వేదాలు చదివితే నాలుక తెగ్గొసేదని వింటే చెవులలో సిసం పోషరాణి అంతిమంగా నిమ్నజాతులకు విద్యకు దూరం చేశారని అన్నారు. విద్యా లేకుంటే అజ్ఞానులుగా బానిసలుగా మూఢచ్చారులుగా ప్రజలను ఉంచడమే బ్రహ్మణ ఆధిపత్య కులాల శాసనం అన్నారు. అది గ్రహించిన మహాత్మా జ్యోతిభపులే సావిత్రి బయికి చదువులు నేర్పించి పాఠశాలని స్థాపించి స్త్రీలకు విద్యానందించిన దిశాలి విరవనితా సావిత్రి బాయి పూలె అన్నారు. అవమానాలు ఎన్ని ఎదురయినా వెనుకడుగు వేయలేదున్నారు. నేటి పాలకులు భారత రాజ్యాంగం ప్రకారంగా నిర్భందా ఉచిత విద్యా అందించుటకు బడ్జెట్ కేటాఇంపు చేయడం లేదని అన్నారు. సావిత్రి బాయి పూలె ఆశయాలు సాధించుటకు ప్రతి ఒక్కరు సిద్ధం కావాలన్నారు. ఈ కార్యక్రమం లో kvps జిల్లా సహాయ కార్యదర్శి గాదె నర్సింహా బొల్లు రవీందర్. నాయకులు పరిపూర్ణాచారీ ఏరపుల యాదయ్య పుప్పాల మట్టయ్య పాలడుగు ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.