గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేదలకు తమ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని ఆర్ వి ఆర్ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ సాహితీ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్ అండ్ ఆర్ కాలనీ పల్లెపహాడ్ గ్రామంలో ఆర్ వి ఆర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరంలో పలు రకాల జబ్బులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సాహితి మాట్లాడుతూ తమ ఆసుపత్రి ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వారికి కావాల్సిన వైద్య పరీక్షలు నిర్వహించి మందులను ఉచితంగా అందజేస్తున్నామని గర్భిణీలకు ఉచితంగా కాన్పులు చేసి వైద్య సేవలు అందిస్తున్నామని డాక్టర్ సాహితి తెలిపారు. తమ ఆసుపత్రిలో చైల్డ్ అండ్ మదర్ వైద్య సేవలతో పాటు క్రిటికల్ వైద్య శిలను కూడా అందించడం జరుగుతుందని డాక్టర్ సాహితి పేర్కొన్నారు. ఈ వైద్య శిబిరంలో ఆర్ అండ్ ఆర్ కాలనీ పల్లెపహాడ్ గ్రామానికి చెందిన సుమారు 250 మంది రోగులకు పరీక్షల అనంతరం ఉచితంగా మందులు పంపిణీ చేశారు.