కేబినెట్ సమావేశంలో కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు ఇచ్చిన హమీలు అమలుచేసే విధంగా నిర్ణయాలు తిసుకోవాలని డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి డిమాండ్ చేశారు. శనివారం ఆయన గజ్వేల్ లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఏగొండ స్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో 22 లక్షల కౌలు రైతులను ప్రభుత్వం గుర్తించి వారికి భూ అధీకృత సాగుదారుల చట్టం ప్రకారం బుణం, ఇతర ప్రయోజనాలు చేకూరే విధంగా అర్హత కార్డులను జారి చేయాలని డిమాండ్ చేశారు. సాగుదారులకు రైతు భరోసా ఇస్తామని చెబుతూనే అసలైన సాగుదారులను గుర్తించకపొవడం కౌలు రైతులను దగా చేయడమవుతుందన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2033 సెప్టెంబర్ 13 న కౌలు రైతులకు రాసిన బహిరంగ లేఖలో దాదాపు 40 శాతం కౌలు రైతులే భూమిని సాగుచేస్తున్నారని వీరికోసం 2011 కౌలు రైతులకు కార్డులు ఇచ్చేందుకు గత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ప్రకారం వారికి న్యాయం చేస్తామని చెప్పిన హామిని నిలబెట్టుకోవాలన్నారు. రైతు ఆత్మహత్య కుటుంబాలలో 75 శాతం మంది కౌలు రైతులే కాబట్టి వారికి న్యాయం చేకూర్చేవిధంగా నిర్ణయం తీసుకోవాలన్నారు. వ్వవసాయ కూలీ భరోసా కోసం ఆర్థిక సంవత్సరానికి 12 వేలు ఇచ్చేపథకానికి ఉపాధి హమీ కూలీలు 100 రోజులు పనిపూర్తిచేసిన వారికే ఇస్తామనే విషయం మిడియా ప్రకట ద్వారా తెలుస్తున్నందున ఇట్లా చేస్తే చాల కూలీ కుటుంబాలు నష్టపొయే అవకాశమున్నది గనుక జాబ్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి, ఎకరం లోపు పేదలకు ఇవ్వాలని, అదే విధంగా రైతు భరోసా పది ఎకరాల లోపు వారికి వర్థింపచేసి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఉండే విధంగా కేబినెట్లో నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
previous post