మున్సిపల్ అవుట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పలువురు కార్మికులు సోమవారం మున్సిపల్ కమిషనర్ రమాదేవి నీ కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్మికులు ప్రధాన సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లారు. పురపాలక సంఘం లో గత చాలా సంవత్సరాలుగా చాలీ, చాలని వేతనాలతో పనిచేస్తున్నామని పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెరగక దుర్భరమైన జీవితం గడుపుతున్నామని తెలిపారు. ప్రభుత్వం కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలన్నారు. కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని కోరారు. అదేవిధంగా పెండింగ్లో ఉన్న పీఎఫ్ బకాయిలను జమ చేయాలని కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమం లో అధ్యక్షులు కొమ్ము. నాగేశ్వరరావు,కార్యదర్శి కుడుముల. గోపి, నాగరాజు ,సురేష్, ధనమ్మ, లింగమ్మ, నాగమణి, కమలమ్మ,సుంకర నాగరాజు, దాసు, వీరేశం తదితరులు పాల్గొన్నారు…………