Tnrnews.in
తెలంగాణ

ఘనంగా సావిత్రి బాయి పూలే జయంతి 

మల్యాల మండల కేంద్రంలోని బ్లాక్ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా దళిత సంఘ నాయకులు మాట్లాడుతూ సమాజంలో అసమానతలమీద అలుపెరుగని పోరాటం చేసి,మహిళ హక్కుల కోసం విశేష కృషిచేసిన సంఘసంస్కర్త మహనీయురాలు శ్రీమతి సావిత్రిబాయి పూలే అని, ఈనాడు మహిళలు అన్ని రంగాల్లో రాణించడానికి మూల కారణం సావిత్రిబాయి పూలే అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు.. మ్యాక లక్ష్మణ్, మారంపల్లి లక్ష్మణ్, శనిగారపు తిరుపతి, ముప్పారపు రవీందర్, మల్యాల సతీష్ కుమార్, మాడుగుల వెంకటస్వామి,మోనుగూరి అజయ్, మల్యాల నారాయణ, మోత్కుల నర్సయ్య, అంజయ్య, ప్రసాద్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

పోరాటయోధుడు కాచం కృష్ణమూర్తి ములకలపల్లి రాములు

Harish Hs

మహిళా ఉద్యోగుల పట్ల వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు

Harish Hs

తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించిన ట్రాఫిక్ సిఐ

TNR NEWS

టి ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా ఆవిర్భావ దినోత్సవం

TNR NEWS

తెలంగాణ జర్నలిస్టు ఫోరం రజతోత్సవాల పోస్టర్ విడుదల

TNR NEWS

తీర్చలేని ఋణం

TNR NEWS