ఇందిరా అనాధాశ్రమం కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా సహకరించి సహాయ సహకారాలు అందించాలని ఆశ్రమం నిర్వాహకురాలు నాగిరెడ్డి విజయమ్మ ప్రభుత్వాన్ని కోరారు. మునగాల మండలం ముకుందాపురం గ్రామంలో గత 25 సంవత్సరాలుగా ఇందిరా అనాధ ఆశ్రమం స్థాపించి 101 మంది అనాధలను సంరక్షిస్తూ ఇప్పటివరకు 70 మంది అనాధలు మరణించారని వారి దహన సంస్కారాలు చేశామని తెలిపారు. ప్రస్తుత 30 మంది ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్నారని మంగళవారం జిల్లా కేంద్రంలోని 108 మునగాల పైలెట్ యజ్ఞేశ్ గౌడ్ సహకారంతో సకాలంలో ఆస్పత్రిలో చేర్పించి మెరుగైన వైద్యం అందిస్తున్నామని అన్నారు. నిత్యం అవసరమైనటువంటి అన్నము బట్టలు వీరికి అందరికీ కావలసినటువంటి వస్తువులు అన్ని మా యొక్క సొంత ఖర్చులతోటి నిర్వహిస్తున్నామని మా ఆశ్రమంలో పనిచేస్తున్న కొంతమంది సిబ్బందికి మేమే జీతాలు ఇస్తున్నామని చెప్పారు. గతంలో మా అనాధ ఆశ్రమం గురించి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్, జిల్లా జడ్జి దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు. ఇంధిరా అనాధశ్రమానికి ప్రభుత్వం స్పందించి సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.

previous post
next post