ఎస్సీ వర్గీకరణ అమలుకై ఈనెల 11న హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే మేధావుల సంఘీభావ సభను విజయవంతం చేయాలని మాదిగ ఉద్యోగుల సమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శి కత్తి వెంకటేశ్వర్లు మాదిగ పిలుపునిచ్చారు. మంగళవారం కోదాడ పట్టణంలోని హుజూర్నగర్ రోడ్డుల గల అంబేద్కర్ విగ్రహం వద్ద సంఘీభావ సభకు సంబంధించిన కరపత్రాలను ఉద్యోగ సంఘ నాయకులతో కలిసి ఆవిష్కరించి మాట్లాడారు. ప్రొఫెసర్ కాశీం అధ్యక్షతన మందకృష్ణ మాదిగ ముఖ్యఅతిథిగా పాల్గొనే ఈ కార్యక్రమంలో మాదిగ ఉద్యోగులంతా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏపూరి పర్వతాలు, పిడమర్తి సైదులు, జిల్లా ఉపాధ్యక్షులు చేకూరి రమేష్, బోల్లి కొండ కోటయ్య, నందిగామ ఆనంద్, పులి నరసింహారావు, మాదాసు బాబు, గంధం బుచ్చారావు, బొడ్డు హుస్సేన్, అక్షపతి, సైదులు, వెంకటేశ్వర్లు, ఏపూరి రాజు, గుండెపంగు రమేష్, ఏపూరి సత్యరాజు, సోమ పంగు గణేష్, కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు……
previous post
next post