దహన సంస్కారాలకు సహకారాలు అందించడం పుణ్య కార్యమని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ అన్నారు. శుక్రవారం బాలాజీ నగర్ లోని వైకుంఠధామం లో మార్తి. లక్ష్మీ నరసయ్య జ్ఞాపకార్థం వారి కుమారుడు మార్తి శివకృష్ణ ప్రసాద్ దాతృత్వంతో సుమారు 15 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన కోల్డ్ ఛాంబర్ గదులను మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందార్ రావు తో కలిసి ప్రారంభించి మాట్లాడారు. వైకుంఠ దామం నిర్మాణంలో ప్రభుత్వ సహకారంతోపాటు అదనంగా అయినా భారాన్ని పుట్టగుంట రమేష్ బాబు జ్ఞాపకార్థం వారి కుమారులు పుట్టగుంట రవి కిరణ్, సురేష్ కుమార్ లు సుమారు 62 లక్షల రూపాయలు ఖర్చు చేసి నిరుపేదలకు అంతిమ సంస్కారాలు చేయడం మానవత్వం అన్నారు.ప్రతి వ్యక్తికి చివరి మజిలీ స్మశాన వాటిక అని బాలాజీ నగర్ స్మశాన వాటికలో ఇబ్బందులు కలగకుండా పుట్టగుంట. రమేష్ బాబు జ్ఞాపకార్థం వారి కుమారులు బాధ్యతలు తీసుకొని నిర్వహణ చేయడం అభినందనీయం అన్నారు.రాష్ట్రంలోనే బాలాజీ నగర్ స్మశాన వాటిక ఆదర్శంగా నిలుస్తుంది అన్నారు.అద్దే ఇంట్లో ఉండేవారు ఇబ్బందులు పడకుండా ఇటువంటి ఏర్పాటు చేయడం అభినందనీయమని ఇటువంటి పుణ్యకార్యాలకు తన సహకారం తప్పకుండా ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు, మున్సిపల్ చైర్మన్ సామినేని. ప్రమీల, వైస్ చైర్మన్ కందుల. కోటేశ్వరరావు, రాష్ట్ర నాయకులు ఎర్నేని బాబు,ప్రముఖ వైద్యులు డాక్టర్ , రామారావు,కౌన్సిలర్ స్వామి నాయక్, రమణ నాయక్ తొండాపూ సతీష్ తదితరులు పాల్గొన్నారు………..
previous post
next post