కోదాడ మండలం రామలక్ష్మీపురం గ్రామ మాజీ సర్పంచ్ బెల్లంకొండ బ్రహ్మం గౌడ్ గారి తండ్రి వెంకయ్య మృతి బాధాకరం అని కోదాడ బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ శాసన సభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శనివారం కోదాడ మండలం రామలక్ష్మీపురం గ్రామంలో ఇటీవల మృతి చెందిన వెంకయ్య గారి చిత్రపటానికి మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…… వెంకయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వెంకయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.ఆయన వెంట సొసైటీ మాజీ చైర్మన్ ముత్తవరపు రమేష్, మండల సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షులు లక్ష్మీనారాయణ , మండల పార్టీ ప్రధాన కార్యదర్శి శెట్టి సురేష్ నాయుడు, మండల కో ఆప్షన్ మాజీ సభ్యులు ఉద్దండు, మండల యూత్ అధ్యక్షులు వెంకటరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు అంజిరెడ్డి, మండల నాయకులు అప్పారావు, వెంకటేశ్వర్లు,జిల్లా బోసుబాబు నాయకులు, కార్యకర్తలు ,తదితరులు ఉన్నారు.