ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహితుల పాత్ర కీలకం ఆట పాటలు, చిలిపి పనులు కష్టం, సుఖం ఇలా ఏదైనా కాని మన వెన్నంటే ఉండి నేనున్నాను అంటూ ధైర్యం చెప్పేదే ఒక స్నేహం. ఆనందం, బాల్యం, స్మృతులు, కరచాలనాలు, చెమ్మగిల్లిన కళ్ళతో అలింగనాలు గురువుల మందలింపులు తలుచుకుంటూ ఒకసారి వయస్సు మరచి పోయి చిన్న పిల్లల కేరింతలతో అడుగు పెడుతూనే హోదాలను మరిచి ఒకరినొకరు ఆత్మీయంగా పలకరిస్తూ యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బుధవారం. మునగాల మండల పరిధిలోని జడ్.పి.హెచ్.ఎస్ నరసింహులగూడెం పాఠశాలలో 1999-2003 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పండుగగా మారింది

previous post
next post