Tnrnews.in
తెలంగాణ

సెల్ ఫోన్ డ్రైవింగ్ ప్రమాదకరం

రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత అని కోదాడ ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రత మసోత్సవల్లో భాగంగా బుధవారం కోదాడ పట్టణంలోని ఖమ్మం క్రాస్ రోడ్ వద్ద సెల్ ఫోన్ డ్రైవింగ్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ మాట్లాడుతూ.. సెల్‌ఫోన్లు మాట్లాడుతూ వాహనాలు నడపరాదని, వాహనాలు వేగంగా నడిపి ప్రమాదాలకు గురికావద్దని కోరారు. రహదారి నిబంధనలు ఉల్లఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు లైసెన్సు రద్దు చేసి వాహనాలు సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్ల నియంత్రణ కూలిపోయి ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు. అకస్మాత్తుగా ఎదురుగా ఏదైనా వస్తే వాహనంపై నియంత్రణ కొల్పోయి ప్రమాదాలకు దారి తీస్తుందన్నారు.సెల్ ఫోన్ డ్రైవింగ్ తో వాహనదారులు ప్రాణాల పైకి తెచ్చుకుంటున్నారని ఎస్సై ఆవేదన వ్యక్తం చేశారు. మీ కుటుంబానికి మీ అవసరం ఉందని రోడ్డు ప్రమాదాలపై అవగాహన కలిగి ఉండి ప్రమాదాలకు దూరంగా ఉండాలని ఎస్సై సూచించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఘనంగా గణిత పితామహుడు శ్రీనివాస రామానుజన్ 137 వ జయంతి

TNR NEWS

రైతు భరోసా సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి

Harish Hs

బాల సురక్ష కార్యక్రమం సేఫ్ టచ్, అన్ సేఫ్ టచ్ ఆవేర్నెస్ ప్రోగ్రాం.

Harish Hs

ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

Harish Hs

విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఇన్విజిలేటర్లు ఓఎంఆర్ షీట్లపై తప్పుడు హాల్ టికెట్ నెంబర్లు బబ్లింగ్ చేసిన వైనం.. తప్పు తెలుసుకుని దిద్దడంతో ఓఎంఆర్ షీట్ కి బొక్క… ఇష్టానుసారం గా వ్యవహరిస్తున్న ఇన్విజిలేటర్లు పై చర్యలు తీసుకోవాలి… నవోదయ సెంటర్ ముందు ఆందోళన చేసిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు… టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు…

TNR NEWS

కమ్మేసిన మంచు దుప్పటి

Harish Hs