రెండు ద్విచక్ర వాహనాలను దొంగలించి,అదే ద్విచక్ర వాహనాలపై 39 సిలిండర్లను దొంగలించిన దొంగను కోదాడ టౌన్ పోలీసులు గురువారం పట్టుకున్నారు.శుక్రవారం కోదాడ టౌన్ సీఐ రాము తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ టౌన్ ఎస్ఐ రంజిత్ రెడ్డి తన సిబ్బందితో వాహనాలు తనిఖీలు చేస్తున్న క్రమంలో ఒక యూనికాన్ వాహనంపై గ్యాస్ సిలిండర్ ను వేసుకొని వెళ్తున్న వ్యక్తి పోలీసులను చూసి దారి మళ్లించడంతో వారి వెంట వెంబడించి పోలీసులు పట్టుకోవడం జరిగిందని, దాంతో అతను నుండి పూర్తి వివరాలు తెలుసుకొని 23 మంది నుండి గ్యాస్ సిలిండర్ రికవరీ చేయడం జరిగిందని తెలిపారు.అతని పేరు మామిడి శ్రీకాంత్ అని,అతని మీద మొత్తం7 కేసులు నమోదు అయ్యి ఉన్నాయని,కాగా అతనిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.ఈ దొంగను అరెస్టు చేయడంలో చాకచక్యంగా ప్రదర్శించిన కోదాడ పట్టణ సిఐ రాము,ఎస్సై రంజిత్ రెడ్డి,. ఎస్సై సైదులు,క్రైమ్ టీం హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, కానిస్టేబుల్ సతీష్ నాయుడు లను డీఎస్పీ శ్రీధర్ రెడ్డి అభినందించి రివార్డ్ అందించారు.
previous post