మునగాల మండలంలో రైతు భరోసా పథకంలో భాగంగా సాగుకు యోగ్యం కాని భూముల సర్వే శుక్రవారం మునగాల మండల పరిధిలోని కొక్కిరేణి, తాడ్వాయి, కలకోవా,రేపాల రెవెన్యూ గ్రామాల పరిధిలో సర్వే టీంలు సర్వే చేస్తూ ఉన్నాయి. ఈ సర్వే కార్యక్రమాన్ని కోదాడ ఆర్డిఓ సూర్యనారాయణ వెంకట్రాంపురం గ్రామంలోని ఇసుక పట్టీలను పరిశీలించారు.అలాగే తాడ్వాయి గ్రామంలో సర్వేను కోదాడ సహాయ వ్యవసాయ సంచాలకులు డి ఎల్లయ్య పరిశీలించారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ వి.ఆంజనేయులు, మండల వ్యవసాయ అధికారి బి.రాజు, వ్యవసాయ విస్తరణ అధికారులు, రెవెన్యూ శాఖ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు,రైతులు పాల్గొన్నారు.
previous post