చింతపల్లి మండల కేంద్రంలో ఉద్యోగ విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేదిలేదని
ఇంచార్జీ సీఈఓ బాల్దూరి శ్రీనివాస రావు అన్నారు. చింతపల్లి మండల ఎంపీడీవో కార్యాలయాన్ని మంగళవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. అదే విధంగా పంచాయతీ నిర్వహణ వివరాలు, పారిశుద్ధ్య వివరాలు, సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. ఉపాధి హామి పనులపై పలు సూచనలు చేశారు. మండలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఎప్పటికప్పుడు పంచాయతీల్లో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని సీఈవో ఆదేశించారు. విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవన్నారు. ఆయన వెంట ఎంపీడీవో సుజాత, కార్యాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.