ఆర్య వైశ్యులు సంఘటితంగా ఉండి తమ హక్కులను సాధించుకోవాలని సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య సంఘ నూతన అధ్యక్షుడు వెంపటి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఈనెల 15న జిల్లా ఆర్యవైశ్య నూతన కార్యవర్గం పట్టణంలో ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో శుక్రవారం వైశ్య సంఘ నాయకులతో కలిసి కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకుగా ఉండే ఆర్య వైశ్యులు ఐక్యంగా ఉండి రాజకీయంగా, ఇతర రంగాలపరంగా ముందుండాలన్నారు.సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య సంఘ నూతన కార్యవర్గం ఈ నెల 15న స్థానిక గుడుగుంట్ల అప్పయ్య ఫంక్షన్ హాల్ లో ప్రమాణ స్వీకారం చేయనున్నందున జిల్లా పరిధిలోని ఆర్యవైశ్య సోదర సోదరీమణులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైశ్య సంఘ నాయకులు మా శెట్టి అనంత రాములు, ఇరుకుల్ల చెన్నకేశవరావు, ఇమ్మడి రమేష్, ఓరుగంటి ప్రభాకర్, నూనె నాగన్న ,గాదంశెట్టి శ్రీనివాసరావు, ఇమ్మడి అనంత చక్రవర్తి, గుడి గుంట్ల సాయి, బచ్చు రామారావు తదితరులు పాల్గొన్నారు.

previous post
next post