Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

గ్రామ సభలకు కాంగ్రెస్ నాయకులు ఎందుకు వస్తారు మాజీ ఎంఎల్ఏ పెద్ది సుదర్శన్ రెడ్డి 

వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన నర్సంపేట మాజీ శాసన సభ్యులు శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.

 

మంగళవారం జరిగిన నియోజకవర్గ పరిధిలో జరిగిన గ్రామసభలలో మేజారిటి స్థాయిలో స్వచ్చందం గా నిరసనలు తెలిపారు.

నల్లబెల్లి మండల కేంద్రంలో జరిగే గ్రామ సభకు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు ఎందుకు వచ్చారు నా రాజకీయ జీవితంలో మొదటిసారిగా చూస్తున్న నా స్వగ్రామంలో దుకాణాలు షాపులు బంద్ చేసి వందలాదిమంది పోలీసుల మధ్య గ్రామ సభ నిర్వహించడం అన్నారు .గత దసర లో కాంగ్రెస్ నాయకులు గొడవలు సృష్టించడం చూశాం. చెన్నారావుపేట మండలం అమీనాబాద్ లో పత్తి నాయాక్ తండాలో జరిగిన గ్రామ సభలో కూడా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు పాల్గొని ప్రజాస్వామ్య నికి విరుద్ధంగా పనిచేశారు

మంగళవారం మండల కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు కూడా శాంతి భద్రతల కు ఆటంకం కలిగించే కుట్ర కు పాల్పడ్డారు. బిఆర్ఎస్ పార్టీ నాయకులు ముందుగా మేలుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాం.గ్రామ సభలోప్రజలు, మీడియా ప్రతినిధుల పట్ల ఎమ్మెల్యే ప్రవర్తించిన తీరు కరెక్ట్ కాదు. ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రవర్తించిన తీరు ప్రజలు గమనిస్తున్నారు. గ్రామ సభ కు మండల లో పోలీసుల నిర్బంధం లో కర్ఫ్యూ వాతావరణం కలిగించి గ్రామ సభ నిర్వహించారు. గ్రామ సభలలో ప్రజలు పాల్గొనడం ప్రశ్నించడం వారి హక్కు దానిని పోలీసులతో అడ్డుకోవడం అప్రజాస్వామికం.

ఎన్నికల ముందు మీరు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారమే మీ హామీలను ప్రజలు అడుగుతున్నారు

100 రోజులలోనే 6 గ్యారంటీలు 420 హామీలు పూర్తి చేస్తామని చెప్పారు కదా 400 రోజులైనా ఎందుకు జరగడంలేదు. నర్సంపేట ఎమ్మెల్యే ఎక్కడ పర్యటించినా చుట్టు పోలీసులే సామాన్యులకు ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ లేదా.నియోజకవర్గం లో వందల కోట్ల నిధులు రద్దు చేసింది మీరు కాదా ,లాభం వచ్చే పనులను మళ్ళి టెండర్లు వేశారు, లాభం రాని పనులను రద్దు చేశారు.

లాభం మీకు కష్టం నాదా 14 నెలల కాలంలో నియోజకవర్గ పరిధిలో మీరు చేసిన అభివృద్ధి ఎంది అని నిలదీశారు.

మార్పు అంటే నల్లబెల్లి గ్రామ సభ నా, మీ సొంత గ్రామంలో అధికారికంగా చాలా సార్లు గ్రామ సభ లో పాల్గొన్న ఎప్పుడు ఇంత పోలీస్ బలగాలను చూడలేదు

నా సొంత గ్రామానికి ఎంత అభివృద్ధి జరిగిందో మీ గ్రామానికి కూడా అంతే అభివృద్ధి చేశాను. రైతు లకు ఇంకా 49 కోట్ల బోనస్ రావాల్సి ఉంది.గ్రామ సభలు పెద్ద మాయ, స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఇదో స్టంట్

మీ ఆలోచన ల ఫలితం గా నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధి ఇరవై ఎండ్లు వెనక్కి వెళుతుంది.వేల మంది పోలీసులు లేకుంటే తప్ప బయటకు రావా

బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నిధులతో తప్ప మరే అభివృద్ధి లేదు.

పోలీస్ వారికి మరో హెచ్చరిక నాజోలికి వస్తే రాజ్యాంగ పరంగా, చట్ట పరంగా చర్యలు తీసుకుంటా మేము నిజంగా నిరసన తెలుపాలంటే మీరు తట్టుకోగలరా, నల్లబెల్లి గ్రామ సభ ఏ ఉద్దేశంతో ప్రశాంత వాతావరణం లో జరగకుండా అడుగున పోలీసులు నిర్బంధం చేశారు అని అన్నారు ఈ కార్యక్రమంలోమండల పార్టీ అధ్యక్షుడు పిఎసిఎస్ చైర్మన్ మాజీ ఎంపీపీలు మండల పార్టీ నాయకులు క్లస్టర్ బాధ్యులు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు గ్రామ పార్టీ అధ్యక్షులు గ్రామపార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

లక్షడప్పులు వేయిగొంతులు ప్రచార రథయాత్ర కు హాజరైన ప్రజా యుద్ధనౌక డాక్టర్ ఏపూరి సోమన్న

Harish Hs

మణుక దేవాలయంకు వచ్చే భక్తులకు నీళ్లకష్టాలు…

TNR NEWS

ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలి

TNR NEWS

మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

Harish Hs

ఇందిరమ్మ రాజ్యం దేశానికి ఆదర్శం 

TNR NEWS

సర్వేను పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్

Harish Hs