మునగాల మండల కేంద్రంలో స్థానిక పబ్లిక్ స్కూల్లో 2003- 2004 పదవ తరగతి పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 20 సంవత్సరాల తరువాత వేదికగా కలుసుకోవడం అనందదాయకంగా ఉందన్నారు. చిన్ననాటి విద్యాభ్యాస తీపి గుర్తులు నెమరు వేసుకోవడం ఒకరి ఒకరి యోగక్షేమాలు తెలుసుకునేందుకు ఉపాధ్యాయులను గౌరవంగా సన్మానించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమం జీవితంలో మర్చిపోని విధంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ జీవిత గమనంలో జరుగుతున్న సంఘటనలు వారి జీవనశైలి పై వేదికలో కలిసిపంచుకున్నారు. అనంతరం ఆనాటి ఉపాధ్యాయులను శాలువాలతో మెమొంటోలతో ఘనంగా సత్కరించారు. విద్యార్థులకు తీపి గుర్తులుగా 2003 -2004 జ్ఞాపికలు పంచుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆనాటి ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు సుభాష్ చంద్రబోస్ గోపాలరావు సత్యనారాయణ సంజీవరెడ్డి విద్యార్థులు బసవయ్య పుల్లయ్య రఘు కుమార్ రాకేష్ సుమన్ సుధీర్ ఉపేంద్ర చారి రఫీ తదితరులు పాల్గొన్నారు

previous post
next post