కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం ఖండేబల్లూర్ గ్రామానికి చెందినటువంటి ప్రీతిక అనే వివాహిత వయసు 24 సంవత్సరాలు, ఈనెల 21వ తేదీ నుండి కనబడుటలేదని భర్త అయినటువంటి సిద్ది గొండల శ్రీకాంత్ బుధవారం జుక్కల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.