మెట్ పల్లి మున్సిపల్ పరిధిలోని 1వ,4వ,7వ,10వ,13వ,17వ,19వ,22వ,26వ వార్డులలో బుధవారం వార్డు సభలు నిర్వహించారు. కొత్త రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్ల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు సభలలో అవకాశం కల్పించారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు దరఖాస్తు చేసుకున్న వారి జాబితాను అధికారులు సభలలో చదివి వినిపించారు. వార్డు సభలలో ప్రత్యేక అధికారి డిఐఈఓ నారాయణ, మున్సిపల్ చైర్ పర్సన్ రణవేణి సుజాత, కమిషనర్ మోహన్, వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖర్ రావు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు, ఆయా వార్డుల కౌన్సిలర్లు, క్లస్టర్ ఆఫీసర్లు, వార్డు ఆఫీసర్లు, ప్రజలు పాల్గొన్నారు.
………………….
నేడు 8 వార్డులలో వార్డు సభలు
మున్సిపల్ పరిధిలోని 2,5,8,11,14,18,20,23వ వార్డులలో గురువారం వార్డు సభలు నిర్వహించడం జరుగుతుందని కమిషనర్ మోహన్ తెలిపారు. ఈ అవకాశాన్ని వార్డు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.