భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భాజపా మండల అధ్యక్షుడు కొముల రాజుపాల్ రెడ్డి అన్నారు. నూతనంగా గృహప్రవేశం చేసినటువంటి భాజపా బూత్ స్థాయి అధ్యక్షులు గుండెని భూమయ్య, మారు జనార్దన్లకు బుధవారం 20 వేల రూపాయలు విలువగల రెండు చెక్కులను రాజుపాల్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా రాజుపాల్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ తరఫున నుండి శుభ కార్యాలకే కాకుండా ఆస్పత్రి ఖర్చులకు మరియు చనిపోయిన వారి కుటుంబాలకు పార్టీ కార్పస్ ఫండ్ నుండి సహాయం చేయడం అభినందనీయం అన్నారు.
next post