తెలంగాణ : రాష్ట్రంలోని HIV బాధితులకు త్వరలో కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని మంత్రి సీతక్క శనివారం తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 36 వేల మంది HIV బాధితులకు పెన్షన్ అందుతోందన్నారు. కొత్తవారితో కలుపుకుని 50 వేల మందికిపైగా ఆర్థిక సాయం అందనుందని చెప్పారు. 13 వేలకుపైగా దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని, వాటిని వెరిఫై చేసి ఆర్థిక శాఖకు పంపుతామని అన్నారు. వాటికి ఆమోదం లభించగానే పెన్షన్లు మంజూరు చేస్తామన్నారు.