Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

8వేల ఎకరాల భూమిని గుర్తించాం:అదనపు కలెక్టర్

కామారెడ్డి జిల్యావ్యాప్తంగా సాగుకు యోగ్యంకాని భూములను గుర్తించామని అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్లెడ్డి పేర్కొన్నారు. బుధవారం పిట్లంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 8,000 ఎకరాలు సాగుకు యోగ్యంకాని భూములను గుర్తించామన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులకు ఈనెల 26వ తేదీ నుంచి సంక్షేమఫలాలు అందుతాయన్నారు. ఉపాధి హామీలో కనీసం 20రోజులు పనిచేసిన 15,000కు పైగా కూలీలను గుర్తించామన్నారు. అనంతరం మండల కేంద్రంలోని జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలను ఆయన సందర్శించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. తమకు అద్దె సరిపోవట్లేదని గురుకుల పాఠశాల భవన యజమానులు అడిషనల్ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. వారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి అర్హులన్నారు. ఈ కార్యక్రమంలో పిట్లం తహశీల్దార్ వేణుగోపాల్, ఆరీసీవో సత్యనాథ్ రెడ్డి, ప్రిన్సిపాల్ కవిత తదితరులు పాల్గొన్నారు.

Related posts

లచ్చయ్య మృతదేహానికి నివాళులు అర్పించిన సొసైటీ చైర్మన్ డైరెక్టర్లు

Harish Hs

స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీరాజ్ సంఘటన సభ్యులకు ప్రత్యేక స్థానం కల్పించాలని మడుపు మోహన్ విజ్ఞప్తి

TNR NEWS

చెరువు కట్టపై కంపచెట్లను తొలగిస్తాం

Harish Hs

సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శిగా ఎస్.సంతోష్ ఎన్నిక

TNR NEWS

సిపిఎం నేతల అక్రమ అరెస్టు…. విడుదల

TNR NEWS

కోదాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

TNR NEWS