మునగాల :- మునగాల సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలు మాజీ ఎంపీటీసీ జూలకంటి విజయలక్ష్మి మాట్లాడుతూ నర్శింహులగూడెం గ్రామం లో.ఈరోజు జరిగిన గ్రామసభలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు రాలేదని రేషన్ కార్డుల కొరకు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని. ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని అర్హులైన వారికి పెన్షన్స్ సౌకర్యం కల్పించాలని. రైతు భరోసా వేస్తానని ఇవ్వకుండా జాప్యం చేయడం సరైనది కాదని వెంటనే రైతులకు రైతు భరోసా డబ్బులు విడుదల చేయాలని. భూమి లేని వ్యవసాయ కార్మికులకు రూ 12000/- లు ఇవ్వాలని. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు గ్రామ మాజీ సర్పంచ్ కొండారెడ్డి, సోంపoగు నరసయ్య, గ్రామ శాఖ కార్యదర్శి నందిపాటి శేఖర్, మారం వెంకట్ రెడ్డి, సీతారాములు, బొంత స్వరూప గురవయ్య, తదితరులు పాల్గొన్నారు