Tnrnews.in
తెలంగాణవిద్య

విద్యార్థులకు సువెన్ కంపెనీ వారి సేవలు అభినందనీయం.. కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి కోట గోపి…

ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను ప్రోత్సహించడం కోసం సువెన్ ఫార్మాసిటికల్ కంపెనీ సహకారంతో అక్షర ఫౌండేషన్ ఆద్వర్యంలో షూ,టై, బెల్టు, నోటుబుక్సు,పరీక్ష పాడ్స్ వంటి స్టడీ స్టేషనరీ పంపిణీ చేయడం అభినందనీయమని కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి కోట గోపి అన్నారు.ఈరోజు మునగాల మండలం నరసింహలగూడెం హైస్కూల్లో సువెన్ ఫార్మాసిటికల్ కంపెనీ సహకారంతో అక్షర ఫౌండేషన్ వారు ఇచ్చిన స్టడీ స్టేషనరీని ప్రధానోపాధ్యాయులు అనురాధ అధ్యక్షతన సభ ఏర్పాటు చేసి విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థు చదువులో రాణించడం కోసం సువేన్ కంపెనీ మరియు అక్షర ఫౌండేషన్ విద్యార్థులకు సేవలు అందించడం అభినందనీయమని అన్నారు. విద్యార్థులు ఉన్నత ఆశయాలతో లక్ష్య సాధన వైపు పయనించాలని అన్నారు. చదువులు మెరుగైన ప్రతిభ కనబరచడం కోసం ఇలాంటి సేవలను ఉపయోగించుకోవాలని తెలిపారు.జిల్లాలోని మారుమూల గ్రామాల విద్యార్థులను చదువులో వెన్ను తట్టి ప్రోత్సహించడం కోసం సువెన్ ఫార్మసిటికల్ కంపెనీ ఇలాంటి సేవలు చేయడం సంతోషకరమని అన్నారు. నరసింహులగుడెం హైస్కూల్ విద్యార్థులకు స్టడీ స్టేషనరీని ఇచ్చినందుకు సువెన్ కంపెనీకి మరియు అక్షర ఫౌండేషన్ నిర్వాహకులకు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనురాధ ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు గోళ్ళమూడి రమేష్ బాబు,తూము శ్రీనివాసరావు,మిట్ట గడుపుల ప్రకాశం,ఏలె హరికృష్ణ, బొల్లేద్దు శ్రీనివాస్ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

భాజపా బూత్ స్థాయి నాయకులకు చెక్కులు అందజేత

TNR NEWS

ఎర్నేని బాబు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ జయంతి

TNR NEWS

కోదాడ పట్టణ, నియోజకవర్గ నిరుద్యోగులకు గొప్ప సువర్ణ అవకాశం

TNR NEWS

సృజనకు పునాది పుస్తకాలు” తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షులు జూలూరు గౌరీ శంకర్

TNR NEWS

బాధితుల ఇంటి వద్ద నుండి తొలి FIR నమోదు చేసిన సూర్యాపేట జిల్లా పోలీస్. _ఇంటి వద్దే FIR.. తొలి కేసు నమోదు చేసిన సూర్యాపేట జిల్లా నడిగూడెం పోలీసులు.

TNR NEWS

TNR NEWS