కె.ఆర్.ఆర్. ప్రభుత్వ జూనియర్ కళాశాల కోదాడలో ఎన్.ఎస్.ఎస్ విభాగం ఆధ్వర్యంలో “జాతీయ ఓటర్ల దినోత్సవం” జరుపుకోవడం జరిగింది. కళాశాల తెలుగు అధ్యాపకులు, ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రాం అధికారి వేముల వెంకటేశ్వర్లు నిర్వాహకులుగా కొనసాగిన ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ జి. లక్ష్మయ్య పాల్గొని మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని, ప్రతి ఎన్నికల్లో అందరూ విధిగా ఓటేయాలని, మతం, జాతి, కులం, సంఘం, భాష అనే బేధాలు లేకుండా నిర్భయంగా ఓటు వేయాలని యువతకు పిలుపునిచ్చారు. రాజనీతి శాస్త్ర అధ్యాపకులు జి.వెంకన్న మాట్లాడుతూ… ప్రతి ఒక్కరి ఓటు దేశ భవిష్యత్తుపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతోందన్నారు. సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకోవాలని, అలా చేయకపోతే సమాజ అభివృద్ధి కుంటుపడుతుందని అందుకే ప్రతి ఒక్కరూ జ్ఞానంతో ఓటు వేయాలని అన్నారు. ప్రజల మనసును గెలుచుకునే వారిని ఎన్నుకోవాలని, అందరూ విధిగా ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. తదనంతరం కళాశాల సిబ్బంది చేత, ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్స్ చేత, విద్యార్థుల చేత “ఓటర్ల ప్రతిజ్ఞ” చేయించిన అనంతరం వాలంటీర్స్ చేత ర్యాలీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో
జి.యాదగిరి,వి.బల భీమారావు, జి.నాగరాజు, ఆర్ .రమేష్ శర్మ, ఎం. రత్నకుమారి, పి. రాజేష్, బి. రమేష్ బాబు, పి. తిరుమల, ఇ.సైదులు, ఎన్.రాంబాబు, కె.శాంతయ్య, యన్.జ్యోతి, ఆర్.చంద్రశేఖర్, ఎస్. వెంకటాచారి, టి.మమత, డి.యస్.రావు మొదలగువారు పాల్గొన్నారు.