పూర్వ విద్యార్థులు మంచానికే పరిమితమైన తమ మిత్రురాలికి శుక్రవారం ఆర్థిక సహాయం అందించారు. మునగాల మండలం, నరసింహుల గూడెం జడ్పీహెచ్ఎస్ లో ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థులు తమ మిత్రురాలు మోతే మండలం నామవరాని కి చెందిన గడ్డం సంధ్య గుండె ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ మంచానికే పరిమితమయ్యారని తెలుసుకొని 41 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి బాసటగా నిలిచారు. అనంతరం పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ... మాతో విద్యనభ్యాసించిన విద్యార్థిని, విద్యార్థులకు ఏ విధమైన ఆపద వచ్చిన ఇదేవిధంగా సహాయం చేస్తూ ముందుంటామని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఎస్.కె నాగుల్ మీరా, సతీష్, లక్ష్మీనారాయణ, వీరబాబు, మధుసూదన్, రఫీ, ఉప్పలాచారి, సరిత,నాగమణి, ఉపేంద్ర, స్వరూప తదితరులు పాల్గొన్నారు.