Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

జర్నలిస్టులకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి

రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వెంటనే మంజూరు చేయాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ (టియు డబ్ల్యూజే,ఐజేయు ) *జిల్లా అధ్యక్షులు కోల నాగేశ్వరరావు, ప్రెస్ క్లబ్ జిల్లా అధ్యక్షులు గింజల* *అప్పిరెడ్డి* కోరారు. సోమవారం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో టియుడబ్ల్యూజె యూనియన్ డైరీని ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హత కలిగిన జర్నలిస్టుల అందరికీ ఇండ్లు స్థలాలు మంజూరు చేయాలన్నారు. జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు లో అవకాశం కల్పించాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలును వర్తింపజేయాలని కోరారు. ప్రభుత్వం హెల్త్ కార్డులు సక్రమంగా అమలయ్యేలా చూడాలన్నారు. కార్పొరేట్ వైద్యశాలలో హెల్త్ కార్డులకు సరైన వైద్య సదుపాయం కల్పించడంలో అధికారులు విఫలమైనారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుడు రాయపూడి చిన్ని, టి యు డబ్ల్యూ జే యూనియన్ దాడుల నిరోధక కమిటీ జిల్లా అధ్యక్షులు బాదే రాము, జిల్లా ఉపాధ్యక్షులు ఆవుల మల్లికార్జున రావు, కోట రాంబాబు, సతీష్ కుమార్, అలుగుబెల్లి హరినాథ్, పాల్గొన్నారు.

Related posts

రవీంద్ర ప్లే స్కూల్లో అంబరానంటిన బాలల దినోత్సవ వేడుకలు

TNR NEWS

జిల్లాస్థాయి వైద్య విజ్ఞాన ప్రదర్శనలో ప్రతిభ కనబరిచిన విద్యార్థి

TNR NEWS

కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌పై హైకోర్టు కీలక తీర్పు

TNR NEWS

మహిళా సంఘ డైరెక్టర్ గా ఆవుల విజయలక్ష్మి

TNR NEWS

కన్‌సాన్‌పల్లిలో ఘనంగా దత్తాత్రేయ జయంతి ఉత్సవాలు సామూహిక సత్యనారాయణ వ్రతాల నిర్వహణ అశ్రమంలో అన్నదాన కార్యక్రమం

TNR NEWS

పాఠశాల వార్డెన్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన వరంగల్ జిల్లా కలెక్టర్

TNR NEWS