Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణవిద్య

ప్రభుత్వ పాఠశాలకు ఆర్ధిక సహాయం అందజేత* 

 

వరంగల్ జిల్లా గీసుకొండ మండల కేంద్రానికి చెందిన పసునూటి స్వాతి -కళ్యాణ్ ఎన్నారై సైంటిస్ట్ దంపతులు, సైంటిస్ట్ స్వాతి పుట్టినరోజు సందర్భంగా, తమ ఆత్మీయ మిత్రుడు కర్ణకంటి రాంమూర్తి హెడ్మాస్టర్ గా విధులు నిర్వహిస్తున్న నల్లబెల్లి మండలం, నాగరాజుపల్లి గ్రామంలోని పంతులుపల్లి ప్రాధమిక పాఠశాల విద్యార్థులకు మౌళిక సదుపాయాల కల్పన నిమిత్తమై రూ10,000/-ల ఆర్ధిక విరాళం పంపించారు.

ఈసందర్భంగా పంతులుపల్లి పాఠశాల హెడ్మాస్టర్ కర్ణకంటి రాంమూర్తి మాట్లాడుతూ.. పసునూటి స్వాతి -కళ్యాణ్ ఎన్నారై సైంటిస్ట్ దంపతులు, వృత్తి రీత్యా అమెరికా లో ఉన్నప్పటికీ, వారి మనసంతా మాతృ దేశం కోసం ఏమైనా చేయాలని ఉంటుందని, గతంలో కూడా వారు వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ అందజేశారనీ, కరోనా సమయంలో లక్షల రూపాయలు వెచ్చించి శానిటైజర్స్ ఉచితం గా పంపిణీ చేశారని, వివిధ క్రీడా టోర్నమెంట్ల నిర్వహణకు కూడా ఆర్ధిక సహకారం అందజేశారనీ, ప్రస్తుతం మారుమూల ప్రాంతం లోని తమ పాఠశాల అభివృద్ధికి కూడా ముందుకు రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులు కునమళ్ల రాజన్ బాబు గారు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

అభయాంజనేయ స్వామి దేవాలయంలో అన్నదానం

TNR NEWS

సైకాలజిస్ట్ ల సంఘం జిల్లా అధ్యక్షునిగా రాజశేఖర్

Harish Hs

జిల్లా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు….. రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి

TNR NEWS

పీడీఎస్ బియ్యం పట్టివేత…. 8 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం ను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ అధికారులు….

TNR NEWS

గీత కార్మికుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

TNR NEWS

సీయం సహాయనిది చెక్కులు అంద చేసిన స్పీకర్

TNR NEWS