కోదాడలో జవహర్ లాల్ బాలకేంద్రం ఏర్పాటుకు మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ల సహకారంతో కృషి చేస్తామని జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, కోదాడ తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల లు అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలో రిషి డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో 45 రోజులపాటు నిర్వహించిన సమ్మర్ డాన్స్ కోచింగ్ లో శిక్షణ పొందిన 30 మంది విద్యార్థులకు డాన్స్ మాస్టర్ పేరిణి నాగేశ్వరరావు తో కలిసి ప్రశంశ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంతరించిపోతున్న భరతనాట్యం, పేరిణి నృత్యలను కోదాడ రిషి డాన్స్ లో శిక్షణ పొందిన విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రదర్శనల్లో పాల్గొని కోదాడ ప్రాంతానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకువస్తున్నారని అందుకు ఎంతగానో కృషి చేస్తున్న డాన్స్ మాస్టర్ పేరిణి నాగేశ్వరరావు ను ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో రిషి డాన్స్ అకాడమీ మాస్టర్ పేరిణి నాగేశ్వరరావు, లేడీ డాన్స్ కోచర్ లు ప్రవళిక, వర్షిని విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు……….