ప్రైవేట్ పాఠశాలల్లో మాదిరిగానే ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్కేజీ,యూకేజీ, నర్సరీని ప్రవేశపెట్టాలని మునగాల మండల బరకత్ గూడెం గ్రామానికి చెందిన మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు జిల్లేపల్లి దుర్గాప్రసాద్ గురువారం హైదరాబాదులోని స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….
2009 విద్యకు చట్టం ప్రకారం 25% రాయితీని కల్పించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాదిరిగానే తెలంగాణ ప్రభుత్వం కూడా నోటిఫికేషన్ విడుదలచేసి అమలు చేయాలని,అంతేకాకుండా, ఫీజుల నియంత్రణ కమిటీ సత్వరమే నిర్ణయించి ఏ ఏ తరగతులకు ఎంత ట్యూషన్ ఫీజులు తీసుకోవాలో తెలియజేసి,పేద మధ్యతరగతి పిల్లల జీవన స్థితుల మేరకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల మండలాల గ్రామాల ప్రైవేటు పాఠశాలలో చదివే పిల్లలకు వారి జీవన విధానాల ఆధారంగా ఫీజులు నిర్ణయించి అమలు చేయాలని,నర్సరీ నుండి ఐదో తరగతి వరకు వారి సొంత బుక్స్ పబ్లికేషన్ చేసి 5000 నుండి 15 వేల వరకు బుక్స్ పేరుతో నిలువు దోపిడీ చేస్తున్నారని,ప్రభుత్వ పాఠశాలలో ఉన్న బుక్స్ ను మాత్రమే ప్రైవేట్ పాఠశాలలో అమలుచేయాలని, అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలో కూడా ఎల్ కేజీ, యూకేజీ,నర్సరీ,ఎందుకు అమలు చేయడం లేదని,ఇది పేరు మీద ప్రైవేటు పాఠశాలలో వేల ఫీజులు దోపిడీ జరుగుతుందని, తక్షణమే ప్రభుత్వం స్పందించి, ప్రభుత్వ పాఠశాలలో కూడా ఎల్కేజీ ఎల్, కేజీ,యూకేజీ, నర్సరీ,ప్రవేశపెట్టాలని, తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ వి.నవీన్ నికోలస్ ను కలిసి వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు.