పదోన్నతితో బాధ్యత మరింత పెరుగుతుందని పలువురు కోదాడ మిత్రమండలి సభ్యులు తెలిపారు. గురువారం కోదాడ పబ్లిక్ క్లబ్ లో మిత్రమండలి సభ్యులు ముత్తినేని సైదయ్య ఇటీవల ఏఎస్ఐ నుంచి ఎస్ఐగా పదోన్నతి పొందిన సందర్భంగా కోదాడ మిత్రమండలి సభ్యులంతా కలిసి వారి దంపతులకు శాలువా, పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలుపుతూ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీస్ శాఖలో ముత్తినేని సైదయ్య నిబద్ధత, అంకితభావంతో పని చేశారని వారి సేవలను కొనియాడారు. పదోన్నతి లభించడం విధి నిర్వహణలో బాధ్యతను మరింత పెంచుతుందని భవిష్యత్తులో ప్రజలకు మరిన్ని సేవలు అందించి ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకొని ఇటువంటి పదోన్నతులు మరెన్నో అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మిత్రమండలి అధ్యక్షులు మేకల వెంకట్రావు, ఎస్ ఆర్ కే మూర్తి, ముత్తవరపు పాండురంగారావు, పైడిమర్రి సత్తిబాబు, పట్టాభి రెడ్డి, పోటు రంగారావు, యలమందల నరసయ్య, నాగేశ్వరరావు, పాశం నాగిరెడ్డి, కరుణాకర్, శ్రీనివాసరావు, సత్తిపండు తదితరులు పాల్గొన్నారు………