తెలంగాణ రాష్ట్రంలోనే కోదాడ విశ్రాంత ఉద్యోగుల సంఘం అనేక సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నదని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెళ్ల. సీతారామయ్య అన్నారు. గురువారం కోదాడ పట్టణంలోని స్థానిక పెన్షనర్స్ భవన్ లో కోదాడ యూనిట్ అధ్యక్షులు వేనేపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన జనవరి నెలలో జరుపుకునే విశ్రాంత ఉద్యోగుల పుట్టినరోజు వేడుకలను సామూహికంగా కేక్ కట్ చేసి ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనందంగా, సంతోషంగా ఉంటేనే ఆరోగ్యానికి మంచిదని ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలన్నారు. కోదాడ సంఘం వారు చేసే కార్యక్రమాలను చూసి రాష్ట్రవ్యాప్తంగా ఇతర పెన్షనర్లు అనుసరిస్తున్నారని ఇది తమ సంఘానికి ఎంతో గర్వకారణం అన్నారు. పెన్షనర్లు తప్పనిసరిగా కార్యాలయంలో జరిగే వేడుకలకు హాజరు కావాలన్నారు. అనంతరం పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని శాలువా, మెమొంటో తో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కోదాడ యూనిట్ అధ్యక్షులు వేనేపల్లి శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి, అమృత రెడ్డి,రఘువర ప్రసాద్, విద్యాసాగర్, ,పొట్ట జగన్మోహన్ రావు,భ్రమరాంబ,శోభ, గడ్డం. నరసయ్య, బిక్షం తదితరులు పాల్గొన్నారు……………………..
previous post