కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కేద్రం లో గురువారం కాంగ్రెస్ పార్టీ నాయకులు మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి, గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ…మహాత్మా గాంధీ చేసిన సేవలను కొనియాడారు గాంధీని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. దేశ స్వాతంత్ర్యం కోసం తన ప్రాణ త్యాగాలు చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రామ్ పటేల్ హనుమంతు స్వామి రాజు సంతోష్ మేస్త్రి అశోక్ కల్లూరు వార్ దత్తు బండి వార్ అఖిల్ కమలాకర్ కుశాల్ రచవర్ మాజీ ఎంపిటిసి హనుమాన్లు బండి వార్ బాలాజీ సోషల్ మీడియా ఇంచార్జ్ వున్నారు.