మునగాల మండల పరిధిలోని ఆకుపాముల గ్రామంలో గ్రామానికి చెందిన కందగట్ల సాంబయ్య అనే రైతు అంకూర్ కంపెనీకి చెందిన శ్రీ-101 వరి విత్తనాలను 20 ఎకరాలలో నాటారని ఇప్పుడిప్పుడే కొద్దిగా కంకులు వస్తున్నాయని తెలియజేయడంతో గడ్డిపల్లి కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ నరేష్ తో, కోదాడ సహాయ వ్యవసాయ సంచాలకులు ఎల్లయ్య, మండల వ్యవసాయ అధికారి రాజు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవంబర్ 15 లోపల నారుమడి వేసుకోవడం వల్ల వాతావరణం లో మార్పుల వలన ఇలా జరిగిందని,
ప్రస్తుతం మూడో దఫా ఎకరానికి ఒక బస్తా చొప్పున యూరియా తో పాటుగా ఎకరానికి 25 కిలోల పొటాష్ కూడా వేసుకోవాలని సూచించారు.పొలంలో అగ్గి తెగులు గమనించడం జరిగింది ఈ దశలో అగ్గి తెగులు నివారించకపోతే మెడ విరుపు తెగులుగా మారి, పూర్తి కంకి విరిగిపోయి, పూర్తి స్థాయిలో నష్టం వాటిల్లె అవకాశం ఉంది కావున రైతులందరూ ముందస్తు గా అగ్గి తెగులు కి నివారణ చర్యలు అయిన ఐసోప్రోథయోలిన్ 300 ఎంఎల్ లేదా కాసుగామైసిన్ 500 ఎంఎల్ లేదా టేబ్యు కొనజోల్+ ట్రైఫ్లోక్సిస్ట్రోబిన్ 80 గ్రాములు లేదా అజోక్సి స్ట్రోబిన్ ప్లస్ డైఫనో కొనజోల్ 200 ఎంఎల్ లేదా ట్రోఫీకోనజోల్ + ట్రై సైక్లజోల్ 280 ఎంఎల్ లను ఎకరానికి పిచికారి చేయాలి అని,అలాగే అక్కడక్కడ మొగిపురుగు, ఆకుచుట్ట పురుగును కూడా గమనించడం జరిగింది. దీని నివారణకు కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ 400 గ్రాములు లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 60 ఎంఎల్ పిచికారి చేయాలి అని తెలియజేయడం జరిగింది.