కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్ కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలను కాపాడేందుకు ఉపయోగపడుతుందని సీపీఎం పార్టీ మండల కార్యదర్శి బుర్రి శ్రీరాములు విమర్శించారు. బుధవారం మునగాల మండల కేంద్రంలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంటులో బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది.ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బుర్రి శ్రీరాములు మాట్లాడుతూ.. అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ వ్యవసాయ రంగాన్ని పూర్తిగా విస్మరించిందని గ్రామీణ పేదలకు ఎంతో ఉపయోగపడుతున్న ఉపాధి హామీ చట్టానికి బడ్జెట్లో తగినంత నిధులు కేటాయించలేదని ఉపాధి హామీ కి నిధులు పెంచకుండా మీరు ఎలా అభివృద్ధి చేయగలరని,విద్య వైద్యం ఉపాధి రంగాలకు ప్రాధాన్యత ఇవ్వలేదని ప్రజా పంపిణీ వ్యవస్థకు నిధులు కేటాయింపులు చెయ్యలేదని, ప్రధానమంత్రి ఆవాజ్ యోజన పథకం కింద సంవత్సరానికి రెండు కోట్ల ఇండ్ల నిర్మిస్తామని చెప్పిన ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు అందుకు తగినంత విధంగా నిధులు కేటాయించలేదన్నారు.సామాన్య ప్రజలకు నేరుగా లబ్ది కల్పించేందుకు ఎలాంటి చర్యలు లేవని అన్నారు. వేతన జీవులను పెద్దఎత్తున సంతృప్తి పరుస్తామంటూ గొప్పలు చెప్పి ముష్టి వేసినట్టు ఊరట కల్పించారని విమర్శలు చేశారు. ఈ బడ్జెట్ కార్పోరేట్ శక్తులకు అనుకూలంగానూ కష్టజీవులకు వ్యతిరేకంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా సభ్యులు సభ్యులు షేక్ సైదా, జె విజయలక్ష్మి, బచ్చలకూర స్వరాజ్యం, మండల కమిటీ సభ్యులు చందా చంద్రయ్య, డి వెంకట్ రెడ్డి, బి కృష్ణారెడ్డి, డి స్టాలిన్ రెడ్డి, యస్ పిచ్చయ్య, యన్ సైదులు, లింగయ్య, యం వెంకటాద్రి, వి వెంకన్న,యస్ నరసయ్య, జి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.