ప్రస్తుత సమాజంలో అందరూ సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూర్యాపేట జిల్లా సైబర్ సెక్యూరిటీ డీఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు బుధవారం మునగాల లోని మోడల్ స్కూల్ విద్యార్థులకు,సైబర్ అవగాహన దివాస్ సందర్భంగా,సైబర్ మోసాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ, ప్రస్తుతం జరుగుతున్న జంప్ డిపాజిట్ స్కాం, మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసాలు, క్రిప్టో కరెన్సీ లాభాల సైబర్ మోసాలపై అవగాహన కల్పించారు. సైబర్ అవగాహన దివాస్ సందర్భంగా బుధవారం జిల్లా పోలీస్ వారు అందరూ సైబర్ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారని చెప్పారు. అదేవిధంగా సైబర్ నేరాలకు గురి కాకుండా ముందుగానే గుర్తించాలని, వాట్సాప్ లో వచ్చిన APK Files Install చేసుకోకూడదని, Loan Apps లో లోన్ తీసుకోకూడదని, క్రెడిట్ కార్డు మోసాలు, డిజిటల్ అరెస్ట్ i వంటి నేరాల గురించి అవగాహన కల్పించారు.సైబర్ ఫిర్యాదుకు టోల్ ఫ్రీ నెంబర్ 1930 లేదా cybercrime.gov.in ని సంప్రదించాలని, పోలీస్ సహాయం కోసం డయల్ 100 కు సమాచారం అందజేయాలన్నారు. అనంతరం మునగాల సిఐ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ… స్మార్ట్ ఫోన్ వాడకంలో తగు జాగ్రత్తలు తీసుకొని ఎడల సైబర్ క్రైమ్ మోసాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సూచించారు. ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు , విద్యార్థులు,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

previous post
next post