Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

_పెద్దగట్టు జాతర సందర్భంగా జాతీయరహదారి (ఎన్ హెచ్) 65 పై వాహనాల మళ్లింపు కు రూట్ మ్యాప్ విడుదల చేసిన సూర్యాపేట జిల్లా పోలీసు_

తెలంగాణ రాష్ట్ర రెండవ అతిపెద్ద జాతర దురాజుపల్లి పెద్దగట్టు జాతర ఫిబ్రవరి 16 వ తేదీ నుండి జరగనున్న సందర్బంగా జాతీయరహదారి (ఎన్ హెచ్) 65 పై సూర్యాపేట జిల్లా పోలీస్ వాహనాల మళ్లింపు కు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగినదని జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపినారు.జాతీయరహదారిపై వాహనాల మళ్లింపు, జాతరకు వచ్చే వాహనాల పార్కింగ్ స్థలాలకు సంభందించి రూట్ మ్యాపు లను సిద్దం చేయడం జరిగినది అన్నారు. జాతర సందర్భంగా రోజు మూడు విడతల్లో 24 గంటలు పోలీసు బందోబస్తు నిర్వర్తిస్తాం అన్నారు. ప్రజలు , భక్తులు, వాహనదారులు పోలీసు వారి సూచనలు పాటిస్తూ సహకరించాలని అన్నారు. తేది: 16-02-2025 రోజు తెల్లవారు జాము నుండి జాతీయ రహదారి 65 పై వాహనాల మళ్ళింపు అక్షలు ఉంటాయి. వాహనాల మల్లింపులను వాహనదారులు గమనించాలని కోరారు. పెద్దగట్టు జాతర సందర్భంగా భక్తుల సౌకర్యార్థం వాహనాల మళ్లింపు.

 

_జాతీయరహదారి 65 (ఎన్ హెచ్ 65 ) పై ముఖ్యమైన మళ్ళింపు._

 

*మళ్ళింపు (1) నార్కట్ పల్లి వద్ద :-* హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వెళ్ళు వాహనాలను నార్కట్ పల్లి వద్ద మళ్లించి నల్గొండ వైపు గా మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ మీదుగా విజయవాడ కు పంపడం జరుగుతుంది.

*మళ్ళింపు (2) కోదాడ వద్ద :-* విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్ళే వాహనాలను, కోదాడ వద్ద మళ్లించి హుజూర్నగర్, నేరేడుచర్ల, మిర్యాలగూడ, నల్గొండ, నార్కట్ పల్లి మీదుగా హైద్రాబాద్ మళ్ళించడం జరిగినది.

*మళ్ళింపు (3) :-* హైద్రాబాద్ నుండి ఖమ్మం వెళ్ళే వాహనాలను టేకుమట్ల వద్ద జాతీయరహదారి 365 బిబి మీదుగా వెళ్లాలి.

 

*_సూర్యాపేట-కోదాడ వెళ్ళే వాహనాల మళ్ళింపు:_*

కోదాడ, మునగాల, గుంపుల మీదుగా సూర్యాపేట పట్టణానికి వచ్చే ఆర్టీసీ బస్సులు, ఇతర చిన్న ప్రజా రవాణా వాహనాలు ఎస్సార్ఎస్పీ కెనాల్ నుండి బీబిగుడెం వద్ద నుండి సూర్యాపేట పట్టణానికి పంపడం జరుగుతుంది. సూర్యాపేట పట్టణం నుండి కోదాడ వెళ్ళే ఆర్టీసీ బస్సులు, ప్రజా రవాణా వాహనాలు కుడ కుడ గ్రామం మీదుగా ఐలాపురం వద్ద ఖమ్మం జాతీయరహదారి మీదుగా రాఘవపురం స్టేజి నుండి నామవరం గ్రామం మీదుగా జాతీయరహదారి 65 పై గుంజలూరు స్టేజి వరకు మళ్లించి కోదాడ, విజయవాడ వైపుకు పంపించడం జరుగుతుంది.

 

– జాతరకు వచ్చు భక్తుల వాహనాల పార్కింగ్ నిమిత్తం పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయడం జరిగినది.

– 

*మొదటి పార్కింగ్ ప్రదేశం :*

సూర్యాపేట మీదుగా జాతర కు వచ్చే భక్తుల వాహనాలను ఎన్ హెచ్ 65 మీద గల హెచ్ పీ పెట్రోల్ బంక్ నుండి రాంకోటి తండాకు వెల్లు మార్గంలో వాహనాల పార్కింగ్ కు ద్విచక్ర వాహనాలను, కార్లు, ఆటోలు, ట్రాక్టర్లు, ఇతర వాహనాల కోసం పార్కింగ్ స్థలం ఏర్పాటు.

*రెండవ పార్కింగ్ ప్రదేశం :*

గరిడేపల్లి, పెనపహడ్ వైపుగా జాతర కు వచ్చే భక్తుల వాహనాలను కలక్టర్ పాత కార్యాలయం వెనుక గల స్థలంలో భారి పార్కింగ్ స్థలం ఏర్పాటు.

*మూడవ పార్కింగ్ ప్రదేశం :*

 కోదాడ, మునగాల, గుంపుల వైపుగా జాతర కు వచ్చే భక్తుల వాహనాలను ఖాసింపేట గ్రామం వెల్లు మార్గంలో పార్కింగ్ స్థలం ఏర్పాటు.

*నాలుగోవ పార్కింగ్ ప్రదేశం :*

మోతే, చివ్వేంల మీదుగా జాతరకు వచ్చే భక్తుల వాహనాలను చివ్వేంల మీదుగా మళ్లించి మున్యానాయక్ తండా వద్ద(గట్టుకు వెనకాల) పార్కింగ్ స్థలం కేటాయించడం జరిగినది.

Related posts

పెన్షనర్స్ భవన్ లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

TNR NEWS

*మోకుదెబ్బ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పల్నాటి నర్సింహా గౌడ్ ను తొలగింపు* 

TNR NEWS

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత…..

TNR NEWS

పిల్లలకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై చర్యలు తప్పవు

TNR NEWS

మిర్చి పంటకు కనీస మద్దతు ధర 25 వేలు ప్రకటించాలి.  సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టి పెల్లి సైదులు

TNR NEWS

రేవంత్ రెడ్డి ప్రభుత్వం యూటర్న్ ప్రభుత్వం – ఎన్ సీ సంతోష్ 

TNR NEWS