ప్రెస్ క్లబ్ గోదావరిఖనిలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి అధ్యక్షతన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు, గౌరవ మంత్రివర్యులు ఉత్తంకుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్, పొన్నం ప్రభాకర్ గౌడ్, సీతక్క సురేఖ మంత్రులందరి సమక్షంలో జరిపిన సమావేశంలో భాగంగా బీసీలను ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా బహుజనులందర్నీ బలోపేతం చేయడమే లక్ష్యంగా బీసీలకు 42% రిజర్వేషన్ కేటాయించడంతోపాటు దేశం మొత్తం తెలంగాణ అభివృద్ధిని చూసి గర్వపడే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దబోతున్నామని తెలంగాణ రాష్ట్రంలో బీసీలను బహుజనలను దృష్టిలో ఉంచుకొని సుపరిపాలన అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని అభివృద్ధి ప్రణాళికలో భాగంగానే కుల గణనను చేపట్టామని కులగణన రిపోర్ట్ లో మిగిలిపోయిన వారు ఎవరైనా ఉంటే యుద్ద ప్రతిపాదికన వారి వివరాలను పూర్తిస్థాయిలో సేకరించబోతున్నామని అందుకు ప్రజలందరూ సహకరించాలని గత ప్రభుత్వ పాలకుల హయాంలో బిఆర్ఎస్, బిజేపి లు బీసీలను బహుజనులను హీనంగా చూశాయని,మాయ మాటలతో మోసం చేశాయని గత ప్రభుత్వాల వ్యవహారాన్ని బీసీ లు, బహుజనులు గమనించే వారికి తగిన బుద్ధి చెప్పారని బీసీల బహుజనుల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కృషిని ఓరువలేకనే ప్రతిపక్ష టిఆర్ఎస్ బిజెపి పార్టీలు గగ్గోలు పెడుతూ మేము చేయలేని పని కాంగ్రెస్ పార్టీ చేస్తుందని టిఆర్ఎస్ బిజెపి పార్టీలు కపట ప్రేమను ప్రదర్శిస్తూ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని తస్మాత్ జాగ్రత్త మీరు ఎన్ని కుటిల ప్రయత్నాలు చేసినా బీసీలను బహుజనులను సామాజిక,ఆర్థిక,రాజకీయ, ఉపాధి, వాణిజ్య,వ్యాపార రంగంలో అగ్ర భాగాన నిలపడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేయబోతుందని ఈ సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడం జరిగినది.
