మున్సిపల్ పరిధిలోని దామరగిద్ద గ్రామ గేట్ వద్ద ఆ గ్రామ శివాజీ యూత్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం శివాజీ యూత్ అధ్యక్షుడు సీహెచ్ మల్లేష్ మాట్లాడుతూ.. హిందూ సామ్రాజ్య స్థాపన కోసం కృషిచేసిన, పోరాడిన యోధుడు శివాజీ ఆశయాల సాధనకు యువత కృషి చేయాలని అన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత యువత శివాజీ అడుగుజాడల్లో నలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శివాజీ యూత్ సభ్యులు మహేందర్, రాజు, వెంకటేష్, రజినీకాంత్, మధు, రాజశేఖర్, శ్రీను, శివకృష్ణ, అఖిల్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

previous post
next post