December 8, 2024
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

జుక్కల్ ఎమ్మెల్యేను అభినందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

 

కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మరియు మద్నూర్ ఏఎంసీ ఛైర్మన్ సౌజన్య రమేష్ బుధవారం రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి అభినందించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.జుక్కల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా సూచించారు. ఎమ్మెల్యే మాట్లాడుతు జుక్కల్ నియోజకవర్గంలో మార్కెట్ కమిటీ చైర్మన్ లను ఎంపిక చేసిన విధానాన్ని గురించి మంత్రి కి వివరించారు.రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇంటర్వ్యూ పద్ధతిలో ఏఎంసీ లను ఎంపిక చేశామని తెలిపారు.స్థానిక మండల అధ్యక్షులు మరియు సీనియర్ నాయకుల సమక్షంలో ఆశావాహులందరిని విడి విడిగా కొన్ని ప్రశ్నలతో ఇంటర్వ్యూ చేశామని.ఎవరైతే సరైన సమాధానాలు చెప్పి ఎక్కువ మార్కులు సాధించారో వారినే చైర్మన్ లు గా ఎంపిక చేశామని మంత్రి గారికి వివరించారు.జుక్కల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ ల ఎంపిక అత్యంత పారదర్శకంగా జరిగిందని చెప్పారు.నూతన విధానంలో ఏఎంసీ చైర్మన్ ల ఎంపిక చేపట్టిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు అభినందించారు.ఈ కార్యక్రమంలో రామ్ పటేల్ మద్నూర్ సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్ హనుమాన్లు స్వామి సాయి పటేల్ ఎం. బస్వంత్ రావు వాట్నాల్వార్ రమేష్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.

Related posts

ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

TNR NEWS

యాసంగి పంటకు సిద్ధమవుతున్న మహిళా రైతు  యాసంగి పంటకైనా బోనస్ త్వరగా ఇవ్వాలి  వానాకాల పంట బోనస్ అకౌంట్లో జమకాలేదు 

TNR NEWS

ప్రజలను భయభ్రాంతులకు గురిచేయవద్దు .. అటవీ శాఖ అధికారి నీరజ్ కుమార్ టిబ్రేవాల్

TNR NEWS

ఆశ వర్కర్లకు పెండింగ్ జీతాలు చెల్లించాలి.  సర్వేలు ఆపేస్తాం  డిఎంహెచ్వో కార్యాలయం ముందు సీఐటీయూ ధర్నా.

TNR NEWS

రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతరావు

TNR NEWS

బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మొదటి సంత్సరము విద్యార్థీ హత్మహత్య

TNR NEWS