కాకినాడ : కాకినాడ పిఠాపురం రోడ్ రహదారిలో 50 ఏళ్ల క్రిందట జె.ఎన్.టి.యు వద్ద ఏర్పడిన ఈద్గా మైదానం పరిధికి చెందిన కోర్టు కేసులు పరిష్కరించే దిశగా ప్రభుత్వం చొరవ చూపాలని పౌర సంక్షేమ సంఘం కోరింది. ప్రతి ఏటా రంజాన్ సందర్భంగా జిల్లా కేంద్రంలో నగర ముస్లింలు సామూహికంగా ప్రార్థనలు చేసుకునే ప్రత్యేక వెసులుబాటు వలన ఇక్కడి ఈద్గా మైదానానికి ఆధ్యాత్మిక గుర్తింపు విశేష చరిత్ర ఏర్పడిందన్నారు. ఈద్గా మైదాన పరిధి విషయంలో వ్యాజ్యం పరిష్కారం చేయని కారణంగా అభివృద్ధి జరగడం లేదన్నారు. ప్రభుత్వం చట్టబద్ధమైన అధికారం కల్పించి ఈద్గా మైదానం ప్రగతికి పరిష్కారం చూపాలని పౌర సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు కోరారు. ఈమేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సిఎం కొణిదెలపవన్ కళ్యాణ్, లా అండ్ జస్టిస్ మైనారిటీ శాఖా మంత్రి నస్యం మహ్మద్ ఫరూక్, జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి పొంగూరు నారాయణ, విద్య, ఐటి శాఖామంత్రి లోకేష్ లకు పంపిన వినతి పత్రాల్లో తెలియజేసారు.

previous post