తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోదాడ 17వ వార్డు కౌన్సిలర్ బత్తినేని హనుమంతరావు, జ్యోతి దంపతుల ప్రధమ కుమారుడు అఖిల్, నిరుప దంపతులను ఆశీర్వదించారు. కాగా వారి వివాహం ఈనెల 20వ తారీకు రాత్రి 8 గంటలకు కోదాడ పట్టణంలో అంగరంగ వైభవంగా జరిగింది. కౌన్సిలర్ హనుమంతరావు ఆహ్వానం మేరకు ఆదివారం ఉదయం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వారి నివాసానికి విచ్చేసి నూతన దంపతులు అఖిల్ నిరుపలను అక్షింతలు వేసి ప్రత్యేకంగా ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట మాజీ డిసిసిబి చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు, రావెళ్ల సీతారామయ్య, బొల్లు రాంబాబు, మల్లికార్జున్,హరిప్రసాద్, దండా వెంకటయ్య, శ్రీనివాసరెడ్డి, భూపతి రెడ్డి, అశోక్,రవి తదితరులు పాల్గొన్నారు………