పిఠాపురం : దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన పిఠాపురం పట్టణంలో శివరాత్రి మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి, అమ్మవార్ల శ్రీ పుష్పయాగ మహోత్సవం ఘనంగా ఆలయ అర్చకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ దంపతులు భక్తులకు తాంబూలాలను అందజేశారు. ఉదయం స్వామి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం ఆలయ పుష్కరిణిలో స్వామి, అమ్మవార్లను హంస వాహనంపై తెప్పోత్సవం జరిపించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులు స్వామి అమ్మవార్లను దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు అందుకున్నారు.