కాకినాడ : నెలవంకను సందర్శించిన సందర్భంగా మార్చి 2 ఆదివారం నుండి రంజాన్ మాసం ఉపవాస దీక్షలు చేపడుతున్న ముస్లిం కుటుంబాలకు పౌర సంక్షేమ సంఘం అభినందనలు తెలియజేసింది. సూర్యోదయం కంటే ముందుగా ప్రాతః కాలంలో ఆహారం స్వీకరించి చంద్రుడు ఉదయించే వరకు ఉపవాసం నిర్వహించి రోజుకు అయిదు సార్లు నమాజ్ చేయడం ఆధ్యాత్మిక అమృత వాహిని వంటిదని పౌర సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో కొంతభాగాన్ని పవిత్ర కార్యక్రమాలకు వినియోగించడం ఆదర్శప్రాయంగా పేర్కొన్నారు. ఇఫ్తార్ విందులు ఇవ్వడం ద్వారా సోదర భావాలను ప్రకటించుకోవడం భారతీయ సాంప్రదాయ వైభవంగా పేర్కొన్నారు.

previous post
next post